Theft in meerpet: హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. షరీఫ్నగర్లోని ఓ ఇంటిలో చొరబడిన దొంగలు సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును అపహరించారు. ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బంగారంతో ఉడాయించారు. షరీఫ్నగర్కు చెందిన ఇంటి యజమాని మహమూద్ అలీ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోగా దుండగులు ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన బంగారం లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఏస్, ఎస్వోటీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. 8 మంది సభ్యుల అరెస్ట్