నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పొలం పనులకు వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. తన పుస్తలతాడు 3 తులాలు ఉందని బాధితురాలు మంజుల వాపోయింది.
కుటుంబ సభ్యులతో కలిసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: డబ్బు కోసం చిన్నారిని అమ్మిన తండ్రి అరెస్టు!