ETV Bharat / crime

పొదల్లోకి లాక్కెళ్లి.. మహిళ వద్ద బంగారం, నగదు దోపిడీ

మహిళను మాటల్లో పెట్టి పొదల్లోకి లాక్కెళ్లి ఆమె వద్ద బంగారం, నగదు దొంగిలించిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

robbery, robbery from woman, meerpet police
దోపిడీ, బంగారం దోపిడీ, మీర్​పేట్ పోలీసులు
author img

By

Published : Apr 20, 2021, 8:21 AM IST

రంగారెడ్డి జిల్లాలోని మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోన్న తడకల సుజాత అనే మహిళ ఈనెల 17న మీర్​పేట్ లెనిన్ నగర్​ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తోంది. గమనించిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు.. సుజాతను మాటల్లో పెట్టి ఎవరూ లేని సమయంలో పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె వద్ద ఉన్న 25 గ్రాముల బంగారు గొలుసు, రూ.2వేలు దొంగిలించి పారిపోయారు.

బాధితురాలు మీర్​పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరాల ద్వారా 48 గంటల్లో కేసును ఛేదించారు. బడంగ్​పేట్​ గాంధీనగర్​కు చెందిన సంపంగి చిన్న, ఓర్స శ్రీనులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు గొలుసు, నగదును రికవరీ చేసి బాధితురాలికి అందించారు. నిందితులిద్దర్ని పోలీసులు రిమాండ్​కు తరలించారు. గతంలోనూ వీరిపై పలు కేసులున్నట్లు మీర్​పేట్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.