ETV Bharat / crime

బావతో పెళ్లి వద్దన్నందుకు బాలిక బలవన్మరణం - బాలిక ఉరివేసుకుని బలవన్మరణం

ఓ యువతి తన బావతో పెళ్లి నిశ్చయమైందని సంతోషంగా ప్రేమించింది. కానీ తన బావ మద్యానికి బానిసయ్యాడని ఇంట్లో వాళ్లు ఆ పెళ్లిని రద్దు చేద్దామని అనుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Girl forced to die for not marrying Bava
బావతో పెళ్లి వద్దన్నందుకు బాలిక బలవన్మరణం
author img

By

Published : May 24, 2021, 10:13 PM IST

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ప్రేమించిన మేనబావతో పెళ్లిని కుటుంబ సభ్యులు రద్దు చేయడంతో బాలిక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన బాలిక(14)తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి… ఆమె సోదరితో కలిసి అమ్మమ్మ నివాసం అయిన సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఉంటోంది.

ఆ బాలిక సంగారెడ్డి గురుకుల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా ఆమెను మేనబావ సాయిబాబాకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. దీంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సాయిబాబా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు అతనితో పెళ్లి రద్దు చేద్దామని అనుకున్నారు.

విషయం తెలిసిన ఆ బాలిక మనస్తాపానికి గురై ఇంటి ముందున్న తుక్కుదుకాణంలో… ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె చెల్లెలు చూసి ఇంట్లో తెలుపగా వెంటనే బాలికను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.