ETV Bharat / crime

ఫోన్​ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య - 10th class student suicide in Nizamabad

Girl commits suicide in Nizamabad city: ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మెుబైల్​ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్​ కొనడానికి సంకోచిస్తారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. అదే విధంగా నిజామాబాద్​ జిల్లాలో ఓ సంఘటన జరిగింది.

The girl committed suicide because her father did not buy her a cell phone
తండ్రి సెల్ ఫోన్ కొనీయలేదని బాలిక ఆత్మ హత్య
author img

By

Published : Dec 29, 2022, 8:10 PM IST

Girl commits suicide in Nizamabad city: ఈ రోజుల్లో మెుబైల్​ ఏ జీవితం అయిపోయింది. కొంత మంది ఫోన్​ లేకపోతే ఎంత దారుణం చేయడానికైనా వెనకాడరు. ఇలాంటి సందర్భంల్లో వారి ప్రాణాలు పొగొట్టుకుంటారు లేదంటే వేరే వాళ్లకి సమస్యగా మారతారు. ఈ విధంగానే నిజామాబాద్​ జిల్లాలోని ఓ బాలిక తల్లిదండ్రలు సెల్​ఫోన్​ కొనలేదని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... నిజామాబాద్​ నగరంలోని సుభాష్​నగర్​కు చెందిన ఓ బాలిక హాస్టల్​లో ఉండి పదో తరగతి చదువుకునేది. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. చదువుపై అంత మక్కవ లేకపోవడంతో తిరిగి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయింది. చదువుకోమని తల్లిదండ్రులు ఎంత చెప్పిన వినలేదు. ఇటీవలే తనకు ఫోన్​ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగింది. ఎన్నిసార్లు అడిగిన వారు కొనకపోవడంతో మనస్తా పానికి గురై బాలిక తమ ఇంట్లోనే ఫ్యాన్​కి ఉరివేసుకుంది. ఈ సంఘటన 27వ తేది సాయంత్రం జరిగిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.