ETV Bharat / crime

Facebook friendship: ఫేస్​బుక్​ పరిచయం ప్రేమగా మారింది.. యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది.! - ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్‌ పరిచయం

సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత ఉందో.. దుష్ప్రభావం కూడా అదే రీతిలో ఉంది. ముఖ్యంగా సోషల్​ మీడియాలో యువతీయువకుల(Facebook friendship) పరిచయాలు.. ప్రేమగా మారి.. కొన్ని విజయవంతం అయితే.. మరికొన్ని మోసాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో(Facebook friendship) వెలుగు చూశాయి. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు చావు తప్పి బయటపడ్డాడు.

Facebook friendship
ఫేస్​బుక్​ పరిచయం.. మోసం
author img

By

Published : Oct 27, 2021, 11:55 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఓ యువకుడికి ఫేస్‌బుక్‌(Facebook friendship) ద్వారా ఏర్పడిన పరిచయం.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు ప్రాంతాలు.. కృష్ణా జిల్లా మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం పోలీసులను ఉరుకులు పెట్టించింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. జరిగిన సంఘటనను యువకుడు పోలీసులకు(Facebook friendship) వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండేళ్ల కింద పరిచయం

భవానీపురానికి చెందిన యార్లగడ్డ డేవిడ్‌(Facebook friendship) విజయవాడలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్​లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆ యువతితో రెండేళ్ల కిందట డేవిడ్​కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సదరు యువతి సోమవారం సాయంత్రం యువకుడి(Facebook friendship)కి ఫోన్‌ చేసి తాను మైలవరం మండలం పుల్లూరులోని తన మామయ్య వాళ్ల ఇంటి వద్ద ఉన్నానని చెప్పింది. రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాల్సి ఉందని.. తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో డేవిడ్​ సరేనన్నాడు.

కారులో తీసుకెళ్తూ

ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో కారులో పుల్లూరు చేరుకున్న అతను.. ఆమెకు ఫోన్‌ చేసి చిరునామా అడిగాడు. దానికి ఆమె.. తన సోదరుడు వచ్చి తీసుకొస్తాడని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత యువతి సోదరుడు, మరో వ్యక్తి వచ్చి కారులో డేవిడ్​(Facebook friendship)ను జమలాపురం మార్గానికి తీసుకెళ్తూ దారిలోనే బ్లేడుతో అతని మెడ, చేతులు కోశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని అదే కారులో తీసుకుని జి.కొండూరు మండలం కవులూరు, శాంతినగర్‌ మధ్య మార్గంలోని బుడమేరు కాలువలో పడేశారు. డేవిడ్​ ఫోన్‌, ఉంగరాలు లాక్కొని పరారయ్యారు. కారును జి.కొండూరు, చెవుటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారి బైపాస్‌లో వదిలేశారు.

చావు తప్పి

అదృష్టవశాత్తు కాలువలో బాధిత యువకుడికి దుంగ దొరకడంతో ఎలాగొలా ఒడ్డుకు వచ్చాడు. అంతలో అటుగా వెళ్తున్న ఆటోను ఆపి, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసుల సాయంతో విజయవాడలోని ఒక ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఆమె రమ్మంటేనే వెళ్లానన్నాడు

తాను యువతిని ప్రేమించానని, ఆమె రమ్మంటేనే వచ్చానని యువకుడు ఫొటోలు(Facebook friendship) చూపించాడు. సదరు యువతి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంపైనా అస్పష్టత నెలకొనడంతో.. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను, ఎస్సై రాంబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Minor boy suicide: 'అమ్మానాన్న.. నా ఫోన్​ అమ్మి అంత్యక్రియలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.