ETV Bharat / crime

గ్యాస్ సిలిండర్ పేలి... రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి - తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి వేళ అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలోనే మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఒక గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి... ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న మరో పూరింటికి వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.

gas-cylinders-blast-and-two-huts-were-burnt-at-akkampalli-in-kamareddy-district
గ్యాస్ సిలిండర్ పేలి... రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి
author img

By

Published : Mar 20, 2021, 11:21 AM IST

gas-cylinders-blast-and-two-huts-were-burnt-at-akkampalli-in-kamareddy-district
కాలి బూడిదైన వస్తువులు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం అక్కంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న నాగేష్ గుడిసెకు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. భయంతో పరుగులు తీసి బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఎగిసిపడుతున్న మంటలు

అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమై బాధితులు నిరాశ్రయులయ్యారు.

ఇదీ చదవండి: 'మహిళలు, ఉద్యోగులపై దాడులు'... న్యాయవాదిపై పీడీ యాక్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.