ETV Bharat / crime

పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి

gas cylinder blast
gas cylinder blast
author img

By

Published : Jan 25, 2023, 7:30 AM IST

Updated : Jan 25, 2023, 10:01 AM IST

07:25 January 25

పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి

Gas Cylinder Blast in Medak : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది, చేగుంట మండలం చిన్నశివునూరు గ్రామంలో.. రాత్రి ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలుతో కలిసి గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో వీరిరువురు అక్కడిక్కడే సజీవదహనమయ్యారు. భారీ పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మూడు రోజుల క్రితం హైదరాబాద్​ హకీంపేట్‌లోని ఓ స్టవ్‌ రిపేర్‌ షాపులో గ్యాస్ సిలిండర్ల పేలుడు కలకలం సృష్టించింది. పెద్ద సిలిండర్‌ నుంచి.. చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ నింపే క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించింది. భారీ పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Jan 25, 2023, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.