ETV Bharat / crime

కేపీహెచ్​బీలో గ్యాస్ సిలిండర్​ పేలి​ అగ్నిప్రమాదం.. - Telangana crime news

CYLINDER BLAST IN HYDERABAD: గ్యాస్ లీకై ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కూకట్‌పల్లి కెపిహెచ్ బి కాలనీ 4వ ఫేజులో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. సత్యనారయణ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో వంట పనులు అయ్యాక గ్యాస్​ ఆఫ్ చేయకుండా నిద్రపోవడంతో..

CYLINDER BLAST
CYLINDER BLAST
author img

By

Published : Oct 29, 2022, 5:16 PM IST

CYLINDER BLAST IN KPHB: గ్యాస్ లీకై ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కూకట్‌పల్లి కేపీహెచ్​బీ కాలనీ 4వ ఫేజులో తెల్లవారుజామున చోటుచేసుకుంది. సత్యనారయణ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో వంట పనులు పూర్తయ్యాక.. గ్యాస్​ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు. ఉదయాన్నే టీ పెట్టేందుకు గ్యాస్​ వెలిగించడంతో పెద్ద శబ్ధంతో పేలుడు జరిగి, ఇంట్లో ఉన్నవారందరికీ మంటలు అంటుకున్నాయి.

పేలుడు ధాటికి ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. మంటలంటుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు, ఒకరికి 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.