ఓల్డ్ బోయిన్‌పల్లి పరిధిలోని వల్లభనగర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడ్డారు. రెగ్యులేటర్ భాగంలో చిల్లులు పడి.. గ్యాస్ లీక్ అవగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఈద్గా సమీపంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇంటి పక్కన ఉండే ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి మంటలను అదుపులోకి తీసుకురాగా ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు సిలిండర్ పేలుడు కారణాలను పరిశీలించారు.
ఇదీ చదవండి: రైల్లో కోటి రూపాయల నకిలీ కరెన్సీ