Scorpio fell into reservoir: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం వద్ద గంజాయి తరలిస్తున్న వాహనం జలాశయంలోకి దూసుకెళ్లింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి మైదాన ప్రాంతం రహదారిపైకి వస్తుండగా సినీఫక్కీలో పోలీసులు వెంబడించారు. ఇది గమనించిన గంజాయి వాహన డ్రైవర్ వేగంగా నడిపాడు.
ఈ క్రమంలోనే భూపతిపాలెం జలాశయం వద్దకు రాగానే వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం స్కార్పియో పక్కనే ఉన్న జలాశయంలో పడిపోయింది. పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని వెలికితీశారు. అందులోని 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి: