ETV Bharat / crime

Ganjai at shadnagar: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం​.. పలు చోట్ల అరెస్టులు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని షాద్​నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రహదారి పక్కనే ఓ హోటల్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన 180 గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్​లో 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. మంచిర్యాలలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 900 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు.

author img

By

Published : Oct 31, 2021, 4:42 AM IST

ganjai seized at several places in the state of telangana
బాలనగర్​లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు తనిఖీలు

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైపాస్​లోని ఆశియానా హోటల్ వద్ద విజయ్ సింగ్​ను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఓ ద్విచక్రవాహనం,రూ.50 వేల విలువైన 180 గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​లోని పురానాపూల్ ధూల్​​ పేట్ ప్రాంతానికి చెందిన విజయ్ సింగ్ (38) బైపాస్ పక్కనే ఉన్న ఆశియానా హోటల్ వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద దాదాపు 1 కేజీ 6 గ్రాముల వరకు ఉంటుందని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఆయన తెలిపారు.

బాలానగర్​లో 1.2 కిలోల గంజాయి స్వాధీనం

బాలనగర్​లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా సాయితేజ, మరో యువతి శ్రుతి ఇద్దరు గంజాయి సరఫరా చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. వారి విచారించగా గంజాయిని వినియోగదారులకు సరఫరా చేసింది తీసుకు వెళ్తున్నట్లు విచారణలో వెల్లడైందని బాలనగర్ ఎక్సైజ్ సీఐ జీవన్ కుమార్ తెలిపారు. కేసులో మరో సంజయ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ల్యాప్​ టాప్, మూడు ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్​కు తరలించారు.

మంచిర్యాలలో ఇద్దరు అరెస్ట్

రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ ఆదేశాల మేరకు గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. అరకు నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వైజాగ్​కు చెందిన వెంకటేష్, సుధాకర్ అరకు నుంచి రైలు మార్గం ద్వారా గంజాయిని మంచిర్యాల తీసుకొని వచ్చి ఇక్కడ యువకులకు అమ్ముతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. మంచిర్యాలలో ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసి గంజాయి అమ్ముతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో నలుగురిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని , మంచిర్యాల జిల్లాలో సీసీసి, శ్రీరాంపూర్,రామకృష్ణాపూర్, మందమర్రి , బెల్లంపల్లి ప్రాంతాలలో సింగరేణి గనులు విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ అమ్మకాలు జరిపితే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఉద్దేశంతోనే ఇక్కడ యువకులను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారని ఆయన అన్నారు. మత్తుకు బానిస కాకుండా తమ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని, గంజాయికి బానిస అయిన వాళ్లు ఉంటే తమకు సమాచారం ఇస్తే సైక్రియాటిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తామని ఏసీపీ అఖిల్ మహాజన్ భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:

Ganja Smuggling: ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.