ETV Bharat / crime

Ganja smuggling: కుకీస్​లో గంజాయి... ఆశ్చర్యపోయిన ఎక్సైజ్ అధికారులు - Ganja smuggling news

Ganja smuggling in visakha : గంజాయిని రవాణా చేసేందుకు అక్రమార్కులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గంజాయిని ఏకంగా బేకరీలో అమ్మే కుకీస్ రూపంలో తయారుచేసి సప్లై చేస్తున్నారు. ఏపీలోని విశాఖలో వెలుగుచూసిన ఈ ఘటన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యపరిచింది.

Ganja smuggling
Ganja smuggling
author img

By

Published : Dec 2, 2021, 11:53 AM IST

Ganja smuggling in visakha: గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటుంటే... అక్రమార్కులు మాత్రం రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏపీలోని విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ, ఉషోదయ కూడలి వద్ద ముందస్తు సమాచారం మేరకు ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బొడ్డు ఆదిత్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా... గంజాయితో తయారు చేసిన 17 కుక్కీలు దొరికాయి. దీంతో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యపోయారు.

తాను కుటుంబంతో కలిసి కాశీకి వెళ్లినప్పుడు 22 గంజాయి కుకీలను కొనుగోలు చేసినట్టు ఆదిత్య తెలిపాడు. నిందితుడి నుంచి 17 కుకీలు, ఓ చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Ganja smuggling
బేకరీలో అమ్మే కుకీస్ రూపంలో గంజాయి

ఇదీ చదవండి: constable rape attempt: బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.