Ganja seize: హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్‌పేట్‌లోని బిగ్‌బజార్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Ganja in Ameerpet: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రవితేజ... నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. అతనికి స్నేహితుడైన పాపారావుతో కలిసి నగరంలోని యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం కార్తీక్ నాని అనే వ్యక్తి మూడు కిలోల గంజాయిని తీసుకొచ్చి రవితేజ, పాపారావులకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. భారీ స్థాయిలో గంజాయిని బిగ్‌బజార్ వద్ద అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కార్తీక్ నాని తప్పించుకున్నాడని వెల్లడించారు. వీరిద్దరిపై మాదకద్రవ్యాల నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి: