Ganja seized: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. పుష్ప సినిమాలో ఎర్ర చందన అక్రమ రవణాను తలదన్నే రీతిలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠా గుట్టురట్టైంది. వరంగల్ జిల్లా రాయపర్తిలో 500కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీంపట్నం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారును ఆపి పోలీసుల తనిఖీలు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించంగా ఈ వ్యవహారం బయట పడిందని డీసీపీ తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వెనకవస్తున్న లారీలో సోదాలు చేయగా గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ కిందిభాగంలో కృత్రిమ సెల్ఫ్ ఏర్పాటుచేసి అందులో గంజాయి ప్యాకెట్లు అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా డిజైన్ చేశారు.
దీనితో పాటు కారులో డిక్కీ, సీట్ల కింద 240 ప్యాకెట్లను అమర్చారు. మొత్తం 500 కిలోల గంజాయి గుర్తించినట్లు వెల్లడించారు. నలుగురు నిందితుల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ సీతారాం తెలియచేశారు.
ఇదీ చదవండి: Ganja seize: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ అసిస్టెంట్ డైరెక్టర్