Mahabubabad Gang War: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి తగిన మైకంలో ఇద్దరు వ్యక్తులు... మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. పాత కక్షలతో జిల్లా కేంద్రానికి చెందిన జానీ, బయ్యశశి... మల్లేశ్‌పై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి, హత్యాయత్నం చేశారు. ఆపే ప్రయత్నం చేసిన మిత్రులకు గాయాలయ్యాయి. వీరిపై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇదివరకే రౌడీషీట్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
కొంతమంది రాజకీయ నాయకుల మద్దతు వీరికి ఉన్నందు వల్లే పట్టణంలో ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలతో తాము భయాందోళనలకు గురవుతున్నట్లు ఆందోళన తెలిపారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్యాంగ్ వార్‌కు సంబంధించిన వీడియోలు వాట్సాప్‌లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి: