ETV Bharat / crime

బాలికపై యువకుడు అత్యాచారం.. అడ్డుకున్న మరో వ్యక్తి కూడా.. - rape on minor girl in vikarabad news

Gang Rape on Minor Girl: మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇలాంటి కేసుల్లో ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా.. మహిళల పట్ల వక్రబుద్ధి మాత్రం మారటం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని చిదిమేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వికారాబాద్​ జిల్లాలో బుధవారం రాత్రి ఓ బాలికపై జరిగిన అత్యాచారం.. ఇందుకు నిదర్శనం.

gang rape on minor girl
వికారాబాద్​లో బాలికపై అత్యాచారం
author img

By

Published : May 12, 2022, 2:41 PM IST

Updated : May 12, 2022, 3:02 PM IST

Gang Rape on Minor Girl: వికారాబాద్​ జిల్లా పూడూరు మండల పరిధిలో అమానుషం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి భోజనం ముగిశాక.. ఆరుబయట నిల్చున్న బాలిక(15)పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సన్నివేశాన్ని గమనించి అడ్డుకోవడానికి వచ్చిన మరో యువకుడు సైతం.. అమానుషంగా ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక తప్పించుకుని కుటుంబీకులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బుధవారం రాత్రి 8.30 గం. సమయంలో ఇంటి బయట నిల్చున్న ఓ బాలికను గమనించిన.. అదే గ్రామానికి చెందిన చింటు అనే యువకుడు.. ఆమె నోరు మూసి ఇంటి వెనుక మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో యువకుడు చాకలి రవి.. చింటును కొట్టి అక్కడి నుంచి పంపించాడు. రవి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతూ ఆ బాలిక ఇంటికి వెళ్తుండగా అడ్డుకున్న రవి.. కనికరం లేకుండా బాధితురాలిపై అత్యాచారానికి యత్నించాడు. ఆందోళన చెందిన బాలిక.. ఆ దుర్మార్గుడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది.

కూతురిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు.. ఆందోళనతో ఏం జరిగిందని ఆరా తీయగా బాలిక రోదిస్తూ జరిగింది చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారుణానికి ఒడిగట్టిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స కోసం తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: పెళ్లిపీటలపై విషాదం.. జీలకర్ర బెల్లం పెడుతుండగా కుప్పకూలిన వధువు

'నేను లేకుండా ఎలా బతుకుతారు కన్నా... అందుకే నాతో తీసుకెళ్తున్నా'

వలపు వలలో చిక్కి దేశ సమాచారం లీక్​.. వాయుసేన అధికారి అరెస్ట్​!

Last Updated : May 12, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.