దిల్లీ నుంచి మర్దన చేయాలని స్నేహితురాలిని పిలిపించి చెప్పినట్లు ఒప్పుకోలేదని.. గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబయిలో నివసిస్తున్న నృత్యకారిణి, మసాజ్‌థెరపిస్టు కాకులి బిశ్వాస్‌కు బంజారాహిల్స్‌లో నివసించే సంజన స్నేహితురాలు. తనకు తెలిసిన వారికి మసాజ్ చేయడానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని సంజన చెప్పడంతో బిశ్వాస్ అంగీకరించింది. ఈనెల 9న సంజన ఆమెకు దిల్లీ నుంచి విమాన టిక్కెట్ బుక్ చేయడంతో సంజన నివాసానికి చేరుకొంది. 10న సంజన స్నేహితులు కోమటి, సునీత సైతం వచ్చారు.
అనంతరం తనకు తెలిసిన వారికి మర్దనతో పాటు శారీరక సుఖం అందిస్తే అధిక డబ్బులు ఇస్తారంటూ సంజన చెప్పడంతో బిశ్వాస్, మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. 12న బిశ్వాస్ క్యాబ్‌లో జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాల సమీపంలో నివసించే వారి వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడికి కోమటి, సునీతతో పాటు మరో ఐదుగురు పురుషులు వచ్చారు. అక్కడ కోమటి, సునీతలు బిశ్వాస్‌తో గొడవకు దిగారు. కోరుకున్న విధంగా ఉండటం లేదని ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. మరుసటి రోజు(13న) ఉదయం ఇంటికి వచ్చిన సంజనకు కోమటి, సునీతలు బిశ్వాస్ గురించి చెప్పారు.
దీంతో ముగ్గురూ బిశ్వాస్‌తో గొడవకు దిగారు. బిశ్వాస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించడంతో ముగ్గురూ కలిసి ఆమె దుస్తులు తొలగించి పారిపోకుండా గదిలో నిర్భందించారు. కొట్టడమే కాకుండా పళ్లతో కొరికారు. తలపై హెయిర్ డయర్, ఒంటిపై శానిటైజర్ పోయడమే కాకుండా, కళ్లలో, నోటిలో, నడుం కింది భాగంలో స్ప్రే కొట్టారు. దీంతో బాత్‌రూంలోకి వెళ్లిన బిశ్వాస్ తలుపులు వేసుకొంది. శనివారం ఉదయం కిటికీ నుంచి ఎలాగొలా బయట పడి.. అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రికి వెళ్లి, అటు నుంచి బంజారాహిల్స్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సంజనతో పాటు కోమటి, సునీతలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి..:
Mother Suspicious Death: అచేతనంగా అమ్మ.. మృతదేహం వద్దే మూడ్రోజులుగా కుమారుడు