ETV Bharat / crime

ఫ్రెండ్సే కదా అని ఇంటికి భోజనానికి పిలిస్తే.. అంత పని చేశారేంట్రా బాబు..

Robbery In Friends House: తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఫీలయ్యాడో ఏమో.. తన మిత్రులను భోజనానికి అహ్వానించాడు. ఇంటికి వచ్చిన మిత్రులు.. భోజనం చేశారో లేదో తెలియదు కానీ.. ఇంకోసారి ఇంటికి పిలవకుండా చేశారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..

ఫ్రెండ్సే కదా అని ఇంటికి భోజనానికి పిలిస్తే.. అంత పని చేశారేంట్రా బాబు..
ఫ్రెండ్సే కదా అని ఇంటికి భోజనానికి పిలిస్తే.. అంత పని చేశారేంట్రా బాబు..
author img

By

Published : Sep 13, 2022, 10:07 PM IST

ఫ్రెండ్సే కదా అని ఇంటికి భోజనానికి పిలిస్తే.. అంత పని చేశారేంట్రా బాబు..

Robbery In Friends House: మిత్రుని ఇంటికి భోజనానికి వెళ్లి అతని ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు ఇద్దరు ప్రబుద్ధులు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు విహారయాత్రకు వెళ్లడంతో రూపేశ్ అనే వ్యక్తి తన మిత్రులను ఇంటికి భోజనానికి అహ్వానించాడు. భోజనానికి వచ్చిన మిత్రులు రూపేశ్ బయటకు వెళ్లడం గమనించి.. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. విహారయాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన రూపేశ్ తల్లిదండ్రులకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రూపేశ్ ఇద్దరు మిత్రులను విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు.

కడప జిల్లాలోని దేవుని కడపకు చెందిన శ్రీనివాస్​.. స్థానికంగా ఆర్​ఎంపీ వైద్యునిగా పని చేస్తున్నాడు. అతని కూమరుడు రూపేశ్​ను ఇంట్లోనే ఉంచి శ్రీనివాస్​ తన భార్యతో కలిసి ఈ నెల 6న తిరుమలకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రూపేశ్.. తన మిత్రులను ఇంటికి భోజనానికి పిలిచాడు. దీంతో ఇద్దరు మిత్రులు భోజనానికి రూపేశ్ ఇంటికి వచ్చారు. ఏదో అవసరం కోసం రూపేశ్ బయటకు వెళ్లాడు. ఈ సమయంలో బీరువాకు తాళాలు ఉండటం గమనించిన రూపేశ్ మిత్రులు.. అందులో ఉన్న 15 తులాల బంగారు నగలను దొంగిలించారు. వాళ్లు నగలు దొంగిలించిన విషయం రూపేశ్​కు తెలిసి.. తల్లిందండ్రులు వచ్చిన తర్వాత చెప్పాడు.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. చిన్నచౌక్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రూపేశ్ మిత్రులను అరెస్టు చేసి విచారించటంతో నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి పోలీసులు 15 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.ఏడున్నర లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇద్దరు మిత్రులలో ఓ వ్యక్తి మైనర్​ అని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..:

విద్యుత్​ షాక్​కు యువకుడు బలి.. సీసీ కెమెరాలో దృశ్యాలు..

బ్యాంక్ జాబ్​లో చేరిన 5నెలల్లోనే స్కామ్​.. భార్య ఖాతాలోకి కోట్లు.. పని కాగానే జంప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.