ETV Bharat / crime

ఘరానా మోసగాళ్ల ముఠా ఆటకట్టు.. పీడీ చట్టం నమోదు - hyderabad crime news

వరుసగా గొలుసు కట్టు మోసాలకు పాల్పడుతోన్న నలుగురు మోసగాళ్ల ముఠా గుట్టురట్టయింది. సుమారు 10 లక్షల మందిని మోసం చేసిన ఈ ఘరానా కేటుగాళ్లను సైబరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. పీడీ చట్టం నమోదు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు.

ఘరానా మోసగాళ్ల ముఠా ఆటకట్టు
ఘరానా మోసగాళ్ల ముఠా ఆటకట్టు
author img

By

Published : May 2, 2021, 4:53 AM IST

వరుసగా ఆర్థిక మోసాలకు పాల్పడుతోన్న నలుగురు ఘరానా మోసగాళ్ల ముఠాపై సైబరాబాద్​ పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు. ఇండస్​ వివా హెల్త్​ సైన్సెస్ పేరిట అభిలాష్​ థామస్, ప్రేమ్​కుమార్​, సుబ్రహ్మణ్యం, షరీఫ్​లు కలిసి గొలుసు కట్టు మోసాలకు తెర తీశారు. దేశ వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది వద్ద 1,500 కోట్ల వరకు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఈ ముఠాపై గచ్చిబౌలితో పాటు రామచంద్రాపురం పోలీస్​స్టేషన్​లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు పోలీసుల చర్యల్లో భాగంగా నిందితులపై పీడీ చట్టం నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ తెలిపారు.

ఇదీ చూడండి: డబ్బు ఇచ్చినట్టే ఇచ్చాడు.. అదనుచూసి కాజేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.