ETV Bharat / crime

Cyber cheating: మధురమైన మాటలతో కవ్వించి.. అందరినీ దోచుకున్న 'అతడు' - ఆడగొంతుతో మోసం

Cyber cheating: అపరిచిత ఫోన్​ నెంబర్ ద్వారా పరిచయమైన ఆమె.. తన తియ్యని మాటలతో కవ్వించింది. తేనె పలుకులతో అవతలి వారిని పులకరింపజేసింది. మధురమైన తన కంఠంతో కావాల్సినన్నీ కబుర్లు చెప్పింది. అలా వారం, పది రోజులు గడిచాకా అవసరాలకు డబ్బు గుంజింది. ఆమె మాటలకు ఆకర్షితులైన వారు అడిగినంత డబ్బును.. ఫోన్​పే, గూగుల్​ పే ద్వారా పంపేవారు. అయితే అంతటితో అగకుండా మళ్లీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ అడిగేది. కొంతమంది తమ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే.. ఆమెలోని 'అతడు' బయటకు వచ్చేవాడు... 'మీరు నాతో మాట్లాడిన మాటలు రికార్డు చేశా... డబ్బులడిగితే.. సామాజిక మాధ్యమాల్లో పెడతా' అంటూ బెదిరింపులకు దిగుతాడు. అసలు ఇంతకీ ఆ కథ ఏంటంటే..!

Cyber cheating
అందరినీ దోచుకున్న 'అతడు
author img

By

Published : Jun 4, 2022, 8:30 PM IST

Cyber cheating: నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో వెరైటీ మోసంతో దోచుకుంటున్నారు కేటుగాళ్లు. అలాంటి ఓ ఘరానా మోసమే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగింది. గొంతు మార్చి ఆడగొంతుతో తియ్యగా మాట్లాడి.. తెలుగు రాష్ట్రాల్లో వందల మంది వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేశాడో యువకుడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి పట్టణానికి చెందిన రావూరి కుమార్ అనే వ్యక్తి ఆడగొంతుతో పలువురుని మోసం చేసి డబ్బులు వసూలు చేశాడు. గత ఏప్రిల్​లో ఓ వ్యక్తికి ఫోన్​ ద్వారా పరిచయమైన కుమార్.. ఆడ గొంతుతో మాయమాటలు చెప్పాడు. తన ఇంట్లో పరిస్థితి బాగోలేదని పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని కొంత నగదు సాయం చేయాలని కోరాడు. ఆమె (అతడు) మాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి రూ. 16 వేల నగదును ఫోన్​పే​ చేశాడు. ఇలా జరిగిన తర్వాత మరోసారి ఇంకా డబ్బు కావాలని అడిగాడు.

మధురమైన మాటలతో కవ్వించి.. అందరినీ దోచుకున్న 'అతడు'

ఇతను ఒక మిస్స్​డ్ కాల్ ద్వారా అతను పరిచయమైనట్లు తేలిసింది. ఆడవాళ్ల గొంతుతో మాట్లాడుతూ కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు తీసుకోవడం జరిగింది. పిల్లలకు బాగాలేదని చెప్పి ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి 16 వేల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అతనితో పాటు రెండేళ్లుగా చాలామందిని గొంతుమార్చి ఇలానే మోసం చేసినట్లు తేలింది. జల్సాలకు అలవాటు పడి ఇలా మోసాలకు పాల్పడినట్లు గుర్తించాం. నిందితుడు రాయచోటిలోని పోస్ట్​ ఆఫీస్ వీధికి చెందిన కుమార్​గా గుర్తించాం- సీఐ, రాయచోటి

ఆ వ్యక్తి తన వద్ద లేవని చెప్పటంతో.. కుమార్​ తన అసలు రూపం బయటపెట్టాడు. తనతో మాట్లాడిన మాటలను రికార్డు చేశానని.., వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. భయపడిపోయిన బాధితుడు రాయచోటి పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు రాయచోటిలోని పోస్ట్​ ఆఫీస్ వీధికి చెందిన కుమార్​గా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆడ గొంతుతో మోసం చేస్తుంది తానేనని ఒప్పుకున్నాడు. ఏపీ-తెలంగాణల్లో వందల మందిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. విడతల వారీగా బాధితుల వద్ద నుంచి దాదాపు రూ.8 లక్షలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్​​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Jubleehills gang rape: రేప్ జరిగిన ఇన్నోవా కారు ఎక్కడ? అది ప్రభుత్వ వాహనమా?!

బాలిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను రిమాండ్ చేయనున్న పోలీసులు

'కార్బెవాక్స్‌' బూస్టర్​ డోసుకు ఆమోదం.. వారు సైతం తీసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.