ఇండస్ట్రియల్ కంపెనీ పేరుతో దేనా బ్యాంకును ఇద్దరు వ్యక్తులు మోసగించారు. నకిలీ పేపర్లతో దేనా బ్యాంకులో రూ.3 కోట్ల రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారులు.. వారు పేపర్లలో చూపించిన చిరునామాను వెతుక్కుంటూ వెళ్లగా.. అక్కడ కంపెనీ లేకపోవడంతో అవాక్కయ్యారు. మోసపోయామని గ్రహించిన దేనా బ్యాంకు అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు కిశోర్‌కుమార్, బండి శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
ఇదీ చదవండి:
Govt land kabza in Banjara Hills: రూ.220కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.. కేసు నమోదు