హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ‘పేమెంట్ గేట్‌వే’ కంపెనీ (Payment Gateway Company)ని ఇటీవల ప్రారంభించారు. సంస్థ నిర్వహణ కోసం ‘పూల్డ్ అకౌంట్ (Pooled account)’లో కొన్ని కోట్లలో రూపాయలు ఉంచారు. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ‘పేమెంట్ గేట్‌వే కంపెనీ (Payment Gateway Company)’లో మార్చంటైల్‌గా సభ్యత్వం తీసుకున్నాడు. దీంతో అతడికి డబ్బులు జమ చేయడంతో పాటు ఇతరులకు బదిలీ చేసేందుకూ వెసులుబాటు కలిగింది.
సదరు వ్యక్తికి రూ.20 లక్షలలోపు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. అతనికి ఆన్‌లైన్ సాంకేతికతపై పూర్తి అవగాహన ఉండటంతో ‘పేమెంట్ గేట్‌వే (Payment Gateway Company)’ ఖాతా (Pooled account)ను అతడు హ్యాక్ చేసేశాడు. దీంతో కొంతసేపు ఆ కంపెనీ (Payment Gateway Company) లావాదేవీలకు అంతరాయం కలిగింది. ఈ వ్యవధిలో తనకున్న రూ.20 లక్షల పరిమితి దాటి అదనంగా రూ.2 లక్షలు డ్రా చేసి చూశాడు. అతడి ప్రయత్నం ఫలించింది. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మరో ఏడు ఖాతాలకు మొత్తం రూ.1.25 కోట్లు బదిలీ చేసుకున్నాడు.
cyber crime complaint: అధిక లాభాల ఆశ చూపి.. నిండా ముంచేశారు!
Cryptocurrency: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం... రూ.86 లక్షలు టోకరా
Cyber Crime: గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేస్తే..
డబ్బులు బదిలీ అయినట్లు సంస్థ యాజమాన్యానికి హెచ్చరిక సందేశం(అలర్ట్ మెసేజ్) వచ్చింది. దీంతో అప్రమత్తమైన (Payment Gateway Company) యాజమాన్యం మరింత డబ్బు పోకుండా పూల్డ్ ఖాతా (Pooled account)ను స్తంభింప చేశారు. ఒడిశాకు చెందిన వ్యక్తే ఇదంతా చేసినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సైబర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
ఇదీ చూడండి: Cyber crimes Types: ఫెస్టివల్ ఆఫరా.. స్పెషల్ గిఫ్ట్ వచ్చిందా? కాస్త ఆలోచించండి!
ఆ యాప్‌పై సైబర్ దాడి- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!
CyberCriminals New Plan: సిమ్ బ్లాక్ చేసి... మహిళకు రూ.24 లక్షలు టోకరా
Cyber Crime: సరికొత్తగా.. ఓటీపీ చెప్పకుండానే రూ.19లక్షలు మాయం