Suicide Attempt: పోలీసులు తమ భర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిరలో నలుగురు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఓ చోరీ కేసులో.. కావాలనే తమ భర్తలను ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ నిద్రమాత్రలు మింగారు. వీరిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: