ETV Bharat / crime

Rahul Murder Case: రాహుల్‌ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్ - రాహుల్ హత్య కేసు

విజయవాడ మాచవరం పరిధిలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాహుల్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

Rahul Murder Case: రాహుల్‌ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్

author img

By

Published : Aug 29, 2021, 6:53 PM IST

రాహుల్ హత్య కేసులో పోలీసులు మరింత వేగం పెంచారు. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. హత్యకు ముందు నిందితులు.. రాహుల్‌ను తిప్పిన ప్రదేశాలను సీజ్‌ చేశారు. ఇందులో కోరాడ చిట్‌ఫండ్స్‌, దుర్గా కళామందిర్‌ థియేటర్‌ ఉన్నాయి. మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.

రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది?

విజయవాడ నడిబొడ్డున గత గురువారం కారులో మృతదేహం కలకలం సృష్టించింది. హతుడు పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని దర్యాప్తులో తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా.. బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది.

తెల్లవారీ ఇంటికి రాకపోయేసరికి రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, బోరున విలపించారు. ఈ కేసులో రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి.

ఇదీ చదవండి: Dead body in Car: పార్క్​ చేసిన కారులో మృతదేహం కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.