ETV Bharat / crime

Baby Boy Kidnap : నాలుగు నెలల పసికందు కిడ్నాప్‌.. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు - దురాజ్​పల్లిలో పసికందు కిడ్నాప్

Baby Boy Kidnap
Baby Boy Kidnap
author img

By

Published : May 4, 2022, 12:49 PM IST

Updated : May 4, 2022, 4:10 PM IST

12:46 May 04

దురాజ్‌పల్లిలో చిన్నారి కిడ్నాప్‌

Baby Boy Kidnap: సూర్యాపేట జిల్ చివ్వెంల మండలం దురాజ్​పల్లిలో నాలుగు నెలల మగ శిశువు కిడ్నాప్ సంచలనంగా మారింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న 4 నెలల బాబును ఆదివారం గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాబు ఇమ్మారెడ్డి శివ(4) కనిపించట్లేదని కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే చివ్వెంల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ నేతృత్వంలో 5 బృందాలతో శిశువు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సంఘటనపై చివ్వెంల పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నాలుగు నెలల శిశువు అపహరణ పోలీసులకు సవాలుగా మారింది. నూతనకల్ మండల కేంద్రానికి చెందిన ఇమ్మారెడ్డి సైదిరెడ్డి , విజయ దంపతులు గత కొన్ని నెలలుగా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి దేవాలయం సమీపంలో గుడారం వేసుకుని నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా.. ఇటీవల ఓ కుమారుడికి జన్మనిచ్చారు. వీరు కొద్దిపాటి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. లింగమంతుల స్వామి గుడి వద్ద కొబ్బరికాయలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతుల కుమారుడిని అపహరించాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

సైదిరెడ్డి స్వగ్రామం నూతనకల్ మండల కేంద్రంలో ఆయన తల్లిదండ్రుల ఆస్తి నుంచి రావాల్సిన భూవాటా వివాదం ఏమైనా శిశువు కిడ్నాప్​నకు కారణమై ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి బాధిత కుటుంబంతో పలుమార్లు వారి శిశువును విక్రయించాలని కోరినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడి పాత్రలేదని తేల్చుకున్నారు. పరిసర ప్రాంతాలను గాలించిన పోలీసులు మానసిక రుగ్మతతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఏమైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు డీఎస్పీ మోహన్ కుమార్ చివ్వెంల పోలీస్ స్టేషన్​లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:నగర శివారులో నగ్నంగా జంట దారుణ హత్య.. యువకుడి మర్మాంగాలను ఛిద్రం చేసి..!

Last Updated : May 4, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.