ETV Bharat / crime

అప్పులే యమపాశాలై.. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి కుటుంబం బలవన్మరణం

Family suicide in Vijayawada, Vijayawada suicide case
విజయవాడలో కుటుంబం ఆత్మహత్య
author img

By

Published : Jan 8, 2022, 10:12 AM IST

Updated : Jan 8, 2022, 12:50 PM IST

10:08 January 08

విజయవాడలో కుటుంబం ఆత్మహత్య

విజయవాడలో కుటుంబం ఆత్మహత్య

Family suicide in Vijayawada : అప్పులు... రాకాసిలా మారాయి... ఎటు వెళ్లినా వెంటాడాయి... కళ్లు మూస్తే కలల రూపంలో... కళ్లు తెరిస్తే కొండలా పేరుకుపోయిన వడ్డీ రూపంలో! ఆ బాధ ముందు మరో ఆలోచనేదీ రాలేదేమో! రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు జీవితం పంచుకున్న భార్య... తాను ఈ లోకం నుంచి శాశ్వతంగా వదిలి వెళ్లిపోవాలనే ఆ ఇంటి యజమాని నిర్ణయం.. నలుగురి ప్రాణాలు తీసింది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబం... అక్కడే ఉసురు తీసుకుంది.

ఏం జరిగింది?

Telangana family suicide : ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబం బలవన్మరణం చెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లోఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్‌ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్‌ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్‌, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.

గదిలో ఇన్సులిన్ సీసాలు..

సత్రం సిబ్బంది, నిర్వాహకులు ఈ కుటుంబం ఉన్న రూమ్‌కు వెళ్లి చూడగా తల్లి, కుమారుడు విగతజీవులుగా కనిపించారు. సూసైడ్ చేసుకున్న గదిలో 20 వరకు ఇన్సులిన్ బాటిల్స్, సిరంజీలు పోలీసులు గుర్తించారు. శరీరంలోకి ఇన్సులిన్ బాటిల్స్ 20 వరకు ఇంజెక్టు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మెడికల్‌ షాపుతో పాటు బీ.ఫార్మసీ చదవడంతో మెడిసిన్స్‌పై ఆశిష్‌కు అవగాహన ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇన్సులిన్ మితిమీరితే షుగర్‌ డౌన్‌ అయి చనిపోతారని పోలీసులు వెల్లడించారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనంతరం పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: Palvancha Family suicide : రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో విడుదల

Last Updated : Jan 8, 2022, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.