Road Accident in Yadadri district : యాదాద్రి జిల్లా బహదూర్ పేట రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. డివైడర్ పనులు చేస్తున్న కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన ఇద్దరిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన వరలక్ష్మి (50), ఊరేళ్ల శ్యామ్ (30) ఊరెళ్ల లావణ్య (32), అంకర్ల కవిత (32)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : కేటీఆర్ అంకుల్.. ప్లీజ్.. రక్షించండి..!