ETV Bharat / crime

Four teenagers died: కర్ణాటకలో విషాదం.. హైదరాబాద్ యువకులు జల సమాధి - కర్ణాటకలో హైదరాబాద్ వాసులు మృతి

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చెందిన నలుగురు​ యువకులు జలసమాధి అయ్యారు. మృతులు హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి ముగ్గురు యువకులు.. సనత్​నగర్​కు చెందిన మరో యువకుడు ఉన్నారు. గోడవాడి గ్రామంలోని దర్గా దర్శనానికి వెళ్లగా.. సమీపంలో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి మృత్యువాత పడ్డారు.

Four teenagers died
నలుగురు హైదరాబాద్ యువకులు జల సమాధి
author img

By

Published : Oct 3, 2021, 9:41 PM IST

Updated : Oct 3, 2021, 11:01 PM IST

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. దర్గాను దర్శించుకునేందుకు వెళ్లిన హైదరాబాద్​ యువకులు జలసమాధి అయ్యారు. మృతుల్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని హాబీబ్ ఫాతిమా నగర్​లో నివాసముండే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు.. సనత్​నగర్​కు చెందిన మరో యువకుడు ఉన్నారు. బీదర్ జిల్లా గోడవాడి గ్రామంలోని దర్గాను దర్శించుకునేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. మృతులు సయ్యద్ హైదర్ (17), మహమ్మద్ జునైద్​ ఖాన్(19), మహమ్మద్ ఫహాద్ (18), సయ్యద్ జునైద్​ (15) గా గుర్తించారు. ఈ ఘటనతో హాబీబ్ ఫాతిమా నగర్ వాసులు విషాదంలో మునిగిపోయారు.

ఆదివారం సెలవు దినం కావడంతో జూబ్లీహిల్స్​లోని హాబీబ్ ఫాతిమా నగర్ వాసులు కర్ణాటకలోని గోడవాడి దర్గా దర్శనానికి వెళ్లారు. ఈ నలుగురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు నలుగురిని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే వీరు మృతి చెంది ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు విద్యార్థులు ఉండగా.. మరో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

ఇదీ చూడండి: Ganja seized: రూ.2కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Last Updated : Oct 3, 2021, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.