ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ బట్టల దుకాణంలో నలుగురు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. దుకాణంలో ఒంటరిగా ఉన్న మహిళను మాటల్లో పెట్టి దాదాపు 40చీరలను చోరీ చేశారు. ఫణిదపు సాంబశివరావు చేనేత బట్టల దుకాణంలో చీరలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన నలుగురు మహిళలు దుకాణంలో చీరలను చీర లోపల దాచారు.
ఆ చీరలతో ఆటో ఎక్కేందుకు బయటకు వచ్చే సమయంలో ఓ మహిళ కాలుజారి కిందబడపోయింది. అదే సమయంలో లోపల దాచిన చీరలు కిందపడిపోయాయి. వెంటనే మిగిలిన ముగ్గురు మహిళలు కిందపడినామెకు అడ్డుగా నిలిచారు. అంతా సర్దుకొని ఆటోలో వెళ్లిపోయారు. మహిళలు వెళ్లిపోయిన తర్వాత లెక్కలు చూసి అవాక్కైన దుకాణ యజమానురాలు... తన భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచదవండి: పోలీసులే ఖంగుతినేలా చేసిన సైకో కిల్లర్.. ఏం జరిగిందంటే?