ETV Bharat / crime

లంచం డబ్బు తగలబెట్టిన మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు

Former vice president of the zonal council burned bribe money
లంచం డబ్బు తగలబెట్టిన మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు
author img

By

Published : Apr 6, 2021, 5:57 PM IST

Updated : Apr 6, 2021, 7:34 PM IST

17:52 April 06

వెల్దండ తహశీల్దార్‌ కోసం రూ.5 లక్షలు తీసుకున్న వెంకటాయగౌడ్‌

లంచం డబ్బు తగలబెట్టిన మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు

నాగర్ కర్నూల్ జిల్లాలో మరో అవినీతి బాగోతం బయటపడింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరెంతకుంట తండా సర్పంచ్ రాములు... వెల్దండ మండలం బొల్లంపల్లిలో కంకర మిల్లు నడుపుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేసి... నిరంభ్యతర పత్రం ఇవ్వాల్సిందిగా వెల్దండ తహశీల్దార్ సైదులుకు దరఖాస్తు పెట్టుకున్నారు. పని పూర్తి కావాలంటే కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉండే మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్​ను కలవాల్సిందిగా తహశీల్దార్ సూచించారు. వెంకటయ్య గౌడ్​ను బాధితుడు కలవగా... ఆయన రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు 5 లక్షలకు ఒప్పందం కుదిరింది.

రూ.5 లక్షలు సిద్ధం చేసుకున్న రాములు... ఏసీబీ అధికారులను సంప్రదించారు. వెంకటయ్య గౌడ్ ఇంటి వద్దకు వెళ్లి లంచంగా డిమాండ్ చేసిన రూ. 5 లక్షలను ముట్టజెప్పారు. ఈలోపు ఏసీబీ అధికారులు దాడులు చేయగా... గమనించిన వెంకటయ్య గౌడ్ తలుపులు మూసి... నగదును గ్యాస్ స్టౌపై కాల్చేశారు. ఏసీబీ అధికారులు బలవంతంగా తలుపులు తెరిచే లోపు 70 శాతం నోట్లు కాలిపోయాయి. నోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏకకాలంలో తహశీల్దార్ సైదులుకు చెందిన ఎల్బీనగర్​లోని నివాసంలో, వెల్దండ తహశీల్దార్ కార్యాలయం, జిల్లెలగూడలోని వెంకటయ్య గౌడ్  ఇంట్లో... సోదాలు నిర్వహించినట్లు మహబూబ్​నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించారు.

ఇదీ చూడండి: మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు

Last Updated : Apr 6, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.