Red sandalwood smuggling in andhra pradesh: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని అటవీ ప్రాంతంలో అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఎర్రచందనం కూలీ వాహనంపై నుంచి దూకి మృతి చెందాడు. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో... అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 50 మంది ఎర్రచందనం కూలీలు ఖాజీపేట నుంచి ప్రొద్దుటూరు వైపు లారీలో పారిపోతూ అధికారులకు తారసపడ్డారు. మైదుకూరు పట్టణ శివారులోని ఫ్లైఓవర్ వద్ద వారిని అదుపులోకి తీసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు.
అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఎర్రచందనం(red sandalwood news) కూలీ వాహనంపై నుంచి దూకి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు తమిళ కూలీలను ప్రొద్దుటూరు అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఫారెస్ట్ అధికారులపై కూలీలు చేసిన దాడిలో.. ఖాజీపేట సెక్షన్ ఆఫీసర్ గాయపడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : Car Fire in Rajendra nagar: ఇంజిన్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. కారు దగ్ధం