ETV Bharat / crime

FOOD POISON: కేక్ తిని 20 మందికి అస్వస్థత.! - people ate cake fell ill

ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో వైకాపా నేత పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి జరిగింది. పుట్టినరోజు కేకు తిన్న సుమారు 20 మంది ఫుడ్ పాయిజన్​తో అస్వస్థతకు గురయ్యారు.

food poision
FOOD POISON: కేక్ తిని 20 మందికి అస్వస్థత.!
author img

By

Published : Jul 10, 2021, 8:51 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో వైకాపా కౌన్సిలర్ రమణ పుట్టినరోజు సందర్భంగా.. కోసిన కేకు తిన్న 20 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా మూడో వార్డు కౌన్సిలర్ రమణ పుట్టినరోజును పురస్కరించుకుని శాంతినగర్​లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న వారికి కేకు పంచారు.

దానిని తిన్న గంటలోనే వారికి కడుపులో తిప్పటం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధులు, చిన్నారులు అస్వస్థతకు గురైన వారిలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేకు తిన్న కౌన్సిలర్ రమణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే కేకు తిన్న వారు అనారోగ్యానికి గురయ్యారని పట్టణ పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Kilady Ladies: టైలరింగ్ వృత్తి... దొంగతనాలు ప్రవృత్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.