ETV Bharat / crime

చేపల ధర తగ్గించమని అడిగితే.. కత్తితో పొడిచేశాడు! - గుడివాడలో చేపల ధర తగ్గించమన్నందుకు ఇద్దరిపై కత్తులతో దాడి

మనుషుల్లో క్రూరత్వపు లక్షణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న వాటికే గొడవలు పడుతున్నారు. క్షణికావేశంలో దాడులు చేసుకుంటున్నారు. కత్తులు దూస్తూ.. నెత్తురు కళ్ల చూస్తున్నారు. తాజాగా చేపల ధర విషయంలో తలెత్తిన చిన్న వివాదం.. ఏకంగా కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

చేపల ధర తగ్గించమని అడిగితే.. కత్తితో పొడిచేశాడు!

author img

By

Published : May 20, 2022, 3:39 PM IST

చేపల ధరను తగ్గించాలని అడిగినందుకు.. ఇద్దరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు విక్రయదారుడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. బంటుమిల్లి రోడ్డులోని శివ చేపల దుకాణంలో.. మహమ్మద్ రబ్బానీ చేపలు కొనుగోలు చేశాడు. కొన్న చేపల్లో అర కిలోకిపైగా జన రావడంతో ధర తగ్గించమని రబ్బానీ అడిగాడు. దీంతో మాటా మాటా పెరిగి.. ఆవేశానికి లోనైన చేపల దుకాణ యజమాని శివ.. రబ్బానీపై దాడి చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న రబ్బానీ కుటుంబసభ్యులు రఫీ, రసూల్​ను ఇదేం పద్ధతని శివను ప్రశ్నించారు. దీంతో పట్టరాని ఆగ్రహంతో శివ తన కుమారుడితో కలిసి రఫీ, రసూల్​పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రసూల్ గొంతుపై తీవ్ర గాయాలు కాగా.. రఫీ చేతులు తెగిపోయాయి. బాధితులను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..:

'కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుంది..'

వావివరసలు మరిచిన కామాంధుడు.. చెల్లెలిపై 6 నెలలుగా అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.