రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మృతి చెందాడు. గ్రామానికి చెందిన హన్మంతు అలియాస్ ఆంజనేయులు(35), లోకేష్(15) కలిసి చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లారు.
చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు ఆంజనేయులు నీళ్లలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం.. మాజీ ఎమ్మెల్యేపై కేసు