ETV Bharat / crime

ఏటీఎం సిబ్బందిని తుపాకీతో కాల్చి చోరీ - firing at hdfc bank atm

హైదరాబాద్‌లో పట్టపగలే దర్జాగా ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. డబ్బులు నింపుతున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో వేట ముమ్మరం చేశారు.

firing at kukatpally atm and theft 5 lakh money

author img

By

Published : Apr 29, 2021, 6:16 PM IST

Updated : Apr 29, 2021, 7:48 PM IST

ఏటీఎం సిబ్బందిని తుపాకీతో కాల్చి చోరీ

హైదరాబాద్ కూకట్​పల్లిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పటేల్​కుంట పార్కు సమీపంలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు దొంగలించేందుకు వచ్చిన ఇద్దరు దుండుగులు... కరెన్సీ నింపేందుకు వచ్చిన ఇద్దరు సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎం వద్దకు పల్సర్ వాహనంపై ముసుగులు, శిరస్త్రాణం ధరించి వచ్చిన ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపారు. దాడిలో అలీ, శ్రీనివాస్ కు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే... సిబ్బందిలోని ఓ వ్యక్తి, మరో స్థానికుడు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిద్దరిని తోసేసిన దుండగులు... 5 లక్షల రూపాయలతో పరారయ్యారు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలీ మృతి చెందాడు.

కాల్పులకు పాల్పడి దోపిడీ చేసిన దుండగులు అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యాలు, ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాలతో విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు లభ్యమయ్యాయి. చోరీకి ముందు దుండగులు రెక్కీ నిర్వహించినట్లు ఈ దృశ్యాల్లో తెలుస్తోంది. 2 బుల్లెట్లు, మ్యాగజైన్ సహా నిందితులు వదిలిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: ఏటీఎంలో డబ్బులు నింపుతున్నవారిపై దుండగుల కాల్పులు

Last Updated : Apr 29, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.