హైదరాబాద్ ఎల్బీనగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కామినేని చౌరస్తా వద్ద రహదారిపై వెళ్తున్న ఓ రోడ్డురోలర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా రహదారిపై రద్దీ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.