హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయం పక్కన ఉన్న మహావీర్ హౌస్ భవనంలోని ఐదో అంతస్తులోని రుద్రవీర్ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో... ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. అటుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కళ్లలోకి.. కళ్లు పెట్టి చూస్తే.. మాట్లాడగలరా.. మైండ్ పని చేస్తుందా?