Fire Accident in Vijayawada: ఏపీలోని విజయవాడ ఆటోనగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మూడు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసు స్టేషన్రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన లారీ బాడీ బిల్డింగ్ చేసే షెడ్డులో ఈ ప్రమాదం జరిగింది. లారీకి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రమాదంలో పక్కనున్న మరో రెండు లారీలకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవీ చూడండి