ETV Bharat / crime

fire accident: ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం.. రూ.50 కోట్ల మేర ఆస్తి నష్టం..!

గజ్వేల్​లోని ఓ ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. సుమారు రూ.50 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

fire accident: ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం.. రూ.50 కోట్ల మేర ఆస్తి నష్టం..!
fire accident: ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం.. రూ.50 కోట్ల మేర ఆస్తి నష్టం..!
author img

By

Published : Sep 19, 2021, 10:45 PM IST

Updated : Sep 20, 2021, 12:08 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ట్రాన్స్​ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.50 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి పక్కనే 132 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ఉంది. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు ఉపకేంద్రం వైపు వెళ్లకుండా నిలువరించారు. దీంతో మరో భారీ ప్రమాదం తప్పింది.

ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రతాప్​రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టంపై అధికారులను ఆరా తీశారు. వినియోగదారులకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంతా ఆహుతి..

గత 2 దశాబ్దాలుగా ఇక్కడ రేకుల షెడ్డులో ట్రాన్స్​ఫార్మర్లను మరమత్తు చేస్తున్నారు. నెలకు సుమారు 30 నుంచి 50 ట్రాన్స్​ఫార్మర్లు ఇక్కడ మరమ్మతులు చేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరమ్మతులు కొనసాగుతాయి. అక్కడే రోలింగ్ స్టాక్ ట్రాన్స్​ఫార్మర్లు వందల సంఖ్యలో ఉన్నాయి. అనుకోని అగ్నిప్రమాదంతో ఇవన్నీ బూడిదయ్యాయి.

ఇదీ చూడండి: Accident: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Last Updated : Sep 20, 2021, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.