కరీంనగర్ జిల్లా ఆర్నకొండ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బ్యాంకు కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేసరికి కంప్యూటర్లు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైయ్యాయి.
ఇదీ చదవండి: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..