Fire accident in Parawada Pharmacity: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. లారస్ ల్యాబ్స్ యూనిట్ 3లో.. ఉత్పత్తి లేని బ్లాక్ శుభ్రం చేస్తున్న సందర్భంలో రియాక్టర్ నుంచి మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడే పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావులు మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్‌సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి