ETV Bharat / crime

మిల్క్​షేక్​ దుకాణంలో అగ్నిప్రమాదం... 6 లక్షల మేర నష్టం! - fire accident in hyderabad

హైదరాబాద్​లోని హబీబ్​నగర్​లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఓవర్ డోస్ అనే మిల్క్ షేక్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు.

fire accident in overdose milkshake shop with current shock

author img

By

Published : Mar 24, 2021, 6:43 PM IST

హైదరాబాద్​లోని హబీబ్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓవర్ డోస్ అనే మిల్క్ షేక్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారమివ్వగా... ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే దుకాణంలోని వస్తువులు దాదాపు దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు. ఘటనా స్థలాన్ని మల్లెపల్లి కార్పొరేటర్ జఫర్​ఖాన్ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీఏ పాస్ కాలేదని విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.