రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు గంటన్నర నుంచి అటవీప్రాంతం తగలబడుతోంది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అడవి గ్రామానికి సమీపంలోనే ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.