బాహ్యవలయ రహదారి వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో కంటైనర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద చేరుకోగానే ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చెలరేగాయి. దీంతో భయభాంత్రులకు గురైన డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపి పరారయ్యాడు. గండిమైసమ్మ చౌరస్తా మీదుగా నర్సాపూర్ వైపు ఓ కంటైనర్ రెండు హిటాచిలతో బయలుదేరింది.
దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. కొందరు నీళ్ల ట్యాంకరు తెచ్చి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో హిటాచిలకు ఎలాంటి నష్టం జరగలేదు. సకాలంలో స్పందించి ఆస్తినష్టం జరగకుండా నివారించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.