ETV Bharat / crime

ఆటోలో ఎగసిన మంటలు.. డ్రైవర్​ సురక్షితం - ఓఆర్ఆర్​పై ఆటోలో మంటలు

బాహ్య వలయ రహదారిపై వెళ్తున్న ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మేడ్చల్​ జిల్లా కీసర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

fire accident at ORR at keesara
ఓఆర్​ఆర్​పై మంటల్లో చిక్కుకున్న ఆటో
author img

By

Published : Mar 27, 2021, 7:17 PM IST

మేడ్చల్ జిల్లా కీసర వద్ద బాహ్య వలయ రహదారిపై ఆటో మంటల్లో చిక్కుకుంది. కట్టెల లోడుతో వెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్​ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఓఆర్​ఆర్​ ట్రాఫిక్​ సిబ్బంది సహాయంతో నీళ్ల ట్యాంకర్​తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతలోనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఓఆర్ఆర్​పై ఘట్​కేసర్​ నుంచి కీసర వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఓఆర్​ఆర్​ పై అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: చిట్కుల్ గ్రామ శివారులో మహిళ దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.