హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 86లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్మెంటులోని కింది గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి (fire accident). ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. ఇంట్లోని వంట సామాగ్రి, ఫర్నీచర్ ఇతర గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి: LIVE VIDEO: గొడ్డలి, బండరాళ్లతో దాడి.. పాత కక్షలే కారణం