ETV Bharat / crime

Fire Accident in Keesara : రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. రూ.10కోట్లకుపైగా నష్టం - keesara fire accident

Fire Accident in Keesara
Fire Accident in Keesara
author img

By

Published : Feb 14, 2022, 12:19 PM IST

Updated : Feb 14, 2022, 2:58 PM IST

12:16 February 14

Fire Accident in Keesara : కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం

కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Keesara : మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లి వద్ద ఓ రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మొదట ఓ కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న మరో పరిశ్రమకు వ్యాపించాయి. ఈ మంటల్లో పరిశ్రమలోని పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire Accident in Keesara Chemical factory : హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో సిబ్బంది త్వరగా అప్రమత్తమవ్వడం వల్ల ప్రాణనష్టం తప్పిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు పరిశ్రమ యజమాని వెల్లడించారు.

Last Updated : Feb 14, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.