హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లోని రాజీవ్ గాంధీ నగర్ ఇండస్ట్రీస్ ఏరియాలో గల ఓ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని జీఎస్ఎన్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో రసాయనాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. డ్రమ్ములు పేలుతుండటంతో మంటలు కంపెనీ కింద ఉన్న గ్లాస్ గోదాముకు వ్యాపించాయి.
సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూకట్‌పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి: విషాదం: పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి