ETV Bharat / crime

బస్​స్టాప్​లో చెలరేగిన మంటలు.. దుకాణాలు దగ్ధం

కోఠి మెడికల్ కళాశాల బస్​స్టాప్​లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

fire accident, hyderabad fire accident
బస్​స్టాప్​లో అగ్నిప్రమాదం, కోఠి బస్టాప్​లో చెలరేగిన మంటలు
author img

By

Published : Jun 7, 2021, 8:56 AM IST

హైదరాబాద్ కోఠి మెడికల్ కళాశాల బస్ స్టాప్​లో అగ్నిప్రమాదం సంభవించింది. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఎదురుగా బస్ స్టాప్​కు ఆనుకొని ఉన్న ట్రాన్స్​ఫార్మర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

బస్ స్టాప్ పక్కనే ఉన్న ఫుట్​వేర్ షాప్, బట్టల దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి. లాక్​డౌన్ కారణంగా ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రాన్స్​ఫార్మర్​లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

బస్​స్టాప్​లో చెలరేగిన మంటలు.. దుకాణాలు దగ్ధం

ఇదీ చదవండి: మానసిక క్షోభకు గురిచేస్తూ.. 'ఊపిరి' తీస్తున్న కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.